*విద్యార్థులలో ఎలక్షన్ జోష్
*విద్యార్థులకు ఓటింగ్ పై అవగాహన.
*ఓటు హక్కు వినియోగించుకున్న విద్యార్థులు.
చిత్రం న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని సెయింట్ థామస్ పాఠశాలలో శనివారం రోజున మాక్ పోలింగ్ నిర్వహించారు, విద్యార్థులకు ఓటింగ్ విధానం పై అవగాహన కల్పించారు. .విద్యార్థులు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు ఉత్సాహంగా మాక్ పోలింగ్ లో పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు దీరారు. నామినేషన్ దాఖలు చేయడం, బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయడం, ఓట్లు లెక్కింపు, ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రం జారీ పై అవగాహన కల్పించారు, ఎన్నికలలో స్కూల్ లీడర్ గా 10 వ తరగతి శ్రీ వర్షిత, అసిస్టెంట్ లీడర్ గా 9వ తరగతి సాయి నిఖిల్, స్కూల్ స్పోర్ట్స్ లీడర్ గా పదవ తరగతి అక్షిత్, అసిస్టెంట్ కల్చరల్ లీడర్ గా 9వ తరగతి శ్రీవిద్య ఎన్నికలలో గెలుపొందారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్& ప్రిన్సిపల్ ఫాదర్ శరన్ రెడ్డి మాట్లాడుతూ..విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన కోసం మాక్ పోలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. సాధారణ ఎన్నికలలో పోలింగ్ పై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఎన్నికలలో గెలుపొందిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పీఈటీ శివానందరెడ్డి మాక్ పోలింగ్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.