భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘తల్లి పేరు మీద ఒక చెట్టు’ కార్యక్రమం కింద మొక్కలు నాటుతున్న యూత్ సభ్యులు
చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని ముద్గల్ గ్రామంలో మేరా యువ భారత్ లో భాగంగా భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో “తల్లి పేరు మీద ఒక చెట్టు” కార్యక్రమం కింద మొక్కలు నాటారు. మన భారత ప్రభుత్వం “తల్లి పేరు మీద ఒక చెట్టు” అనే ప్రోగ్రాం ను 2024 లో ప్రారంభించారు. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశ్యం మన అందరికి భూమి అంటే అమ్మ లాంటిది. తల్లి పేరు మీద ఒక చెట్టును నాటమని వ్యక్తులను ప్రోత్సహించడం ద్వారా, తల్లులు అందించే సంరక్షణ మరియు పెరుగుదలకు ప్రతీకగా ప్రచారం చేస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎంపీడీవో శివ కుమార్ , గ్రామ కార్యదర్శి , భగత్ సింగ్ యువజన అధ్యక్షుడు నర్సయ్య, సభ్యులు రంజీత్ ,గణేష్, ముత్తన్న , రాజన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.