బేలలో ఎంఈఓ కోల నరసింహులు దంపతులను సన్మానిస్తున్న
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా, మండల విద్యాధికారిగా కోల నర్సింహులు ఉద్యోగ విరమణ పొందారు. గురువారం బేల మండల కేంద్రంలోని గణేష్ గార్డెన్లో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి హాజరై ఆయన్ను ఘనంగా సన్మానించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో తహసిల్దార్ రఘునాథ్ రావు ఎంపీడీవో మహేందర్, పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొమ్ము కృష్ణ కుమార్ టిఎన్ స్వామి, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దేవరావు నితిన్, రాష్ట్ర, జిల్లా బాధ్యులు, ఎంఈఓ లు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

