మాట్లాడుతున్న పంబాల సంఘం జిల్లా నాయకులు
చిత్రం న్యూస్, శంకరపట్నం: పంబాల కులస్తులకు జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ లు కుల, నివాస, ఆదాయ, ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదని పంబాల కుల సంఘం జిల్లా నాయకులు రౌతు సంపత్ కుమార్. జిల్లా న్యాయవాదుల సంఘం అసోసియేషన్ నాయకుడు కొరిమి ప్రవీణ్ కుమార్, కొరిమి గణేష్ ఆరోపించారు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల కులస్తులను గుర్తించి ప్రభుత్వం జారీ చేసిందని అన్నారు. ప్రజా పాలనలో భాగంగా ఇంటింటికి తిరిగి అధికారులు పంబాల కులాన్ని నమోదు చేయడం జరిగిందని అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ కాస్ట్ ను మూడు కేటగిరీలుగా తీర్మానం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా పంబాల కులస్తులను ఎస్సీ ఏ క్యాటగిరిలో చేర్చడం జరిగిందని, సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ కు ఎన్నో సార్లు విన్నవించిన ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. పంబాల కులస్తులు కొరిమి. రౌతు.గొట్టే. గుంటి.గడ్డం.గంట, దేవ. సుద్దాల. సుకోసి. బత్తుల ఇంటిపేరు ఉంటుందని తెలిపారు. తాము. జముడికే. సుతి. పంబజోడు. గజ్జలు. తాళాలు. వీర గోల. తదితర వస్తువులు తమ కులస్తుల దగ్గర ఉంటాయని ఆయన చెప్పారు. తాము ఎల్లమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, పోచమ్మ, భూలక్ష్మి, శ్రీలక్ష్మి తదితర గ్రామదేవతలను కొలుస్తామని ఆయన చెప్పారు. ఇంతటి చరిత్ర గల పంబాల కులస్తులను గుర్తించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ,రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

