ఆశా కార్యకర్త భాగ్యలక్ష్మి కుటుంబానికి రూ.51,500 ఆర్థిక సాయం అందజేస్తున్న పీ హెచ్ సీ సిబ్బంది
చిత్రం న్యూస్, శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం పరిధిలోని రాజాపూర్ గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త భాగ్యలక్ష్మి ఇటీవల మరణించారు. కాగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి గొట్టే శ్రవణ్ కుమార్, సిబ్బంది ,ఆశాలు సమిష్టిగా విరాళాలు సేకరించారు. తమ వంతుగా రూ.51,500 నగదును ఆమె కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.

