Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

ప్రభుత్వ పథకాలు పేదలకు అందాలి       

ఆహార భద్రత కార్డును లబ్ధిదారురాలికి అందజేస్తున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, జైనథ్:  కేంద్ర ప్రభుత్వం అయిన రాష్ట్ర ప్రభుత్వం అయిన ఇచ్చే పథకాలు పేదలందరికీ అందాలని, మన డబ్బులను తిరిగి మనకే వివిధ పథకాల ద్వార ప్రభుత్వాలు ఇస్తున్నాయని వాటిని అర్హులైన ప్రతి ఒక్కరూ పొందాలని ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. మంగళవారం జైనథ్ లోని లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మండపంలో  జైనథ్, బేల, సాత్నాల, భోరజ్ మండలాలకు సంబంధించిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్యతో కలిసి లబ్దిదారులకి రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉంటాయని తర్వాత అభివృద్ధి కోసం పనిచేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జైనథ్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, ఆలయ కమిటీ ఛైర్మన్ రుకేష్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, జైనథ్, బేల, భోరజ్, సాత్నాల మండలాల తహసీల్దార్లు,పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments