వైట్ యూనిఫామ్ పంపిణీ చేసిన ప్రభుత్వ బడి పిల్లలతో ఉపాధ్యాయుడు ప్రకాష్, మండల అధికారులు
చిత్రం న్యూస్, సాత్నాల: ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని కాన్ప మేడిగూడ రోడ్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సవాయి ప్రకాష్ , ఆయన కుమారుడు, కోడలు పాఠశాలలో గల మొత్తం101 విద్యార్థులకు రూ.30 వేల విలువగల వైట్ యూనిఫాంలను అందజేసి ఉదారత చాటారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ప్రకాష్ మాట్లాడుతూ.. తమ పాఠశాల పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తగ్గకుండా అన్ని రంగాల్లో ముందుకు తీసుకు వెళ్లాలనే ఉద్దేశంతో తాను ఈ వైట్ యూనిఫామ్ విద్యార్థులందరికీ అందజేశానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీడీఓ వెంకట్ రాజు,ఎంఇఓ గంగుల శ్రీనివాస్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సంజీవరెడ్డి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యవాన్ చిక్తే పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయుడు ప్రకాశ్, వారి కుటుంబ సభ్యుల దాతృత్వాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన రిటైర్డ్ ప్రొఫెసర్ విజయ్ బాబు ,,గ్రామస్తులు మరియు పెద్దలు ప్రధానోపాధ్యాయుల పనితీరును ప్రశంసించారు. పాఠశాల ఉపాధ్యాయులు లెనిన్ బాబు, భూమన్న, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

