బోథ్ సీ హెచ్ సీలో ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, ప్రోహిబిషన్ &ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ , జిల్లా కలెక్టర్ రాజర్షి షా
చిత్రం న్యూస్, బోథ్: ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి, ప్రోహిబిషన్ &ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ వైద్య సిబ్బందికి సూచించారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ సీ హెచ్ సీ ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తో కలిసి ఆదివారం ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రి సిబ్బంది వివరాలు ఆరా తీశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ ఉన్నారు. అంతకుముందు గుడిహత్నూర్ లో ఆయన పర్యటించారు.

