పుస్తక ఆవిష్కరణ
చిత్రం న్యూస్, బేల: సీనియర్ వృక్ష శాస్త్ర అధ్యాపకులు, బేలలోని కీర్తన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. వేముగంటి వరప్రసాద్ రావు రాసిన వివిధ పుస్తకాలని ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వృక్షశాస్త్ర అధ్యాపకులు డా. వెల్మ మధు పర్యవేక్షణలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డా.అచ్చి శ్రీనివాస్, డా.జలగం అనిత, డా.సరస్వతి, డా.కె.మురళి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డా. వెల్మ మధు పలు సలహాలు, సూచనలు అందించారు. భవిష్యత్తు లో మరిన్ని పుస్తకాలు రాసి వృక్షశాస్త్రం గొప్పదనం తెలియజేయాలన్నారు..త్వరలోనే డిగ్రీ మొదటి సంవత్సరం నూతన సిలబస్ పుస్తకాన్ని కూడా విడుదల చేస్తున్న విషయాన్ని డా. వెల్మ మధుకి డా.వరప్రసాద్ రావు తెలియజేశారు.

