బేల తహసీల్దార్ రఘునాథ్ రావ్ కు వినతిపత్రం అందజేస్తున్న ఆదివాసీ సంక్షేమ పరిషత్ జనరల్ సెక్రటరీ నందకుమార్
చిత్రం న్యూస్, బేల: జీవో నెంబర్ 49 ను రద్దు చేయాలని కోరుతూ బేల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జనరల్ సెక్రటరీ నందకుమార్ కమిటీ సభ్యులతో కలిసి తహసీల్దార్ రఘునాథ్ రావ్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ జనరల్ సెక్రటరీ నందకుమార్ మాట్లాడుతూ.. ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ పేరుతో ప్రభుత్వాలు తీసుకొచ్చినా జీవో నంబర్ 49 ద్వారా ఆదివాసీ గ్రామాలు కనుమరుగవు తాయని అడవిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీలకు తీవ్రఅన్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

