*కస్తూర్బా బాలికల పాఠశాల విద్యార్థులతో వివరాలు అడిగి తెలుసుకుంటున్న మండల ప్రత్యేక అధికారి మనోహర్
*జూనోని గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన
చిత్రం న్యూస్, బేల: ప్రజలందరూ తమ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల ప్రత్యేక అధికారి మనోహర్ ప్రజలకు సూచించారు. శుక్రవారం బేల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంతో పాటు మండలం లోని జునోని గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ డ్రై డే, ప్రై డే కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి మనోహర్ మాట్లాడుతూ…వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. అలాగే కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాని సూచించారు. గ్రామాల్లో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో మహేందర్ కుమార్, బేల పంచాయతీ సెక్రటరీ వేణు గోపాల్, అధికారులు తదితరులు ఉన్నారు.

