సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి ఉదారత
*విద్యార్థులకు బ్యాగులు, నోట్ బుక్స్ ఉచితంగా పంపిణీ
చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం మాండగడ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్టులకు బ్యాగులు, నోట్ బుక్స్ లను ఉచితంగా పంపిణీ చేసి సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి ఉదారత చాటుకున్నారు. విద్యార్థులకు చేయూత కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్ బుక్స్ తో పాటు అంగన్వాడీ పిల్లలకు పలకలు పంపిణీ చేశారు. అనంతరం గ్రామానికి చెందిన వగాడే అమృత ట్రిపుల్ ఐటీలో సీట్ సాధించడంతో ఆమెని గ్రామస్తులతో కలిసి సన్మానించారు. అంతకు ముందు తమ గ్రామానికి వచ్చిన ముడుపు మౌనిష్ రెడ్డి ని గ్రామస్తులు డప్పు, వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్ , ప్రధానోపాధ్యాయులు అర్చన, ఉపాధ్యాయులు మచ్చేందర్, సంతోష్, సునంద, అస్మా, ఏఎంసీ మాజీ ఛైర్మన్ ముక్కెర ప్రభాకర్, మాజీ సర్పంచ్ లు నర్రా నాందేవ్, మహేందర్ రావు, నాయకులు ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, కోరట్ల స్వామి, సురేష్ రెడ్డి, పాఠశాల కమిటీ ఛైర్మన్ సరిత, పంచాయితీ కార్యదర్శి ముగ్ద, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


