18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి
*మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఛైర్మన్ మాసం అనిల్ కుమార్
చిత్రం న్యూస్, బోథ్ : 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ మాసం అనిల్ కుమార్ అన్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యం లో మన బాధ్యత అని, ప్రతి ఒక్కరు బాధ్యతగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఓటు హక్కు లేని వారు సంబంధిత బీఎల్ఓలకు ఇవ్వాలని లేకుంటే మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ కార్యాయలంలో ఇచ్చిన ఉచితంగా నమోదు చేస్తామని తెలిపారు. ఓటు హక్కు నమోదుకు పదవ తరగతి మెమో (ఉంటే), ఆధార్ కార్డ్, ఫోటో, ఇంట్లో ఒకరి ఓటర్ ఐడి కార్డ్ మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయం లో ఇస్తే ఉచితంగా అప్లై చేస్తాం అని తెలిపారు. ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు .ఈ కార్యక్రమం లో యూత్ సభ్యులు శివ, సిద్దు, నిఖిల్, సాయి గణేష్,లక్కి తదితరులు పాల్గొన్నారు..


