-Advertisement-

అ ‘పూర్వ’ విద్యార్థుల సమ్మేళనం

బోథ్ లో విద్యార్థుల అ’పూర్వ’ సమ్మేళనం

చిత్రం న్యూస్, బోథ్:  బోథ్ మండల కేంద్రంలో 1981_82  బ్యాచ్ కు చెందిన జడ్పీ ఉన్నత పాఠశాల1983_84 బ్యాచ్ కు చెందిన  ప్రభుత్వ జూనియర్ కళాశాల  పూర్వ విద్యార్టుల సమ్మేళనం ఆదివారం ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. సుమారు 45 సంవత్సరాల క్రితం 16 ఏళ్ల వయసులో  పదో తరగతిలో విడిపోయి 60 ఏండ్ల వయసులో కలిసిన పూర్వ  విద్యార్థుల కలయికకు బోథ్ వేదికయ్యింది. తమకు చదువు చెప్పిన ఆనాటి గురువులు ఏ.నర్సింగ్ రెడ్డి (95),  నర్సారెడ్డి (76),  రమేష్ (72) లని శాలువా కప్పి,  పూలమాలలతో సన్మానించారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే చోట చేరి అంతా సందడి చేశారు. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొందరి కళ్ళలో ఆనంద భాష్పాలు రాలాయి. విద్యార్థులు భూమారెడ్డి, విజయ్, కాశీనాథ్, రమాకాంత్, దేవిధాస్, సదానందం, రమేష్, విలాస్,సునీల్, అనూరాధ, పద్మ, సునీత, ఎస్ ఎస్ ఖాన్, మహేంద్ర, శివాజీ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments