బైక్ దొంగలను పట్టుకొని పోలీసులకు అప్పగింత
చిత్రం న్యూస్, బేల : బేల మండలంలోని పాఠన్ గ్రామ శివారులో బైక్ దొంగతనం చేసిన ఇద్దరు వ్యక్తులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్ర లోని తడేగావ్ గ్రామంలో ఉమేష్ అనే రైతు రోడ్డు పైన బైక్ పెట్టి వ్యవసాయ పొలం పనులు చేస్తుండగా బేల మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్ ని గమనించి దొంగిలించారు. వెంటనే బైక్ యజమాని దొంగిలించిన దొంగల వెంట బైక్ తో వెంబడించి వాహనాన్ని బేల మండలంలోని పాఠన్ శివారులో ఇద్దరు దొంగలను పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే ఆ యువకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఏ.ఎస్ఐ సురేందర్ తెలిపారు.

