వరప్రసాద రావును సన్మానిస్తున్న విద్యార్థులు
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మైనార్టీ జూనియర్ కాలేజ్ లో విద్యార్థుల కెరీర్ గైడెన్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ తత్వవేత్త, సమాజ సేవకులు, బేల కీర్తన డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డా. వేముగంటి వరప్రసాద రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు .విద్యార్థుల ఆసక్తులు, నైపుణ్యాలు, విలువలకు సరిపోయే వివిధ కెరీర్ మార్గాల గురించి, విద్యార్థులు తమ కెరీర్ లక్ష్యాలకు అనుగుణంగా విద్యా ప్రణాళికను ఎలా రూపొందించుకోవాలో చెప్పారు. కెరీర్ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను ఎలా అభివృద్ధి చేయాలో వివరించారు. వివిధ రంగాలలో ఉన్న ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ వేటలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన్ను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధికారి, కాలేజీ ప్రిన్సిపల్ విజయ్ కాంబ్లే పాల్గొన్నారు.