గురువును సన్మానిస్తున్న పూర్వ విద్యార్థులు
చిత్రం న్యూస్, జైనథ్: గురు పూర్ణిమను పురస్కరించుకొని జైనథ్ మండలంలోని దీపాయిగూడ ఉన్నత పాఠశాల1997-98 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు తమకు చదువు చెప్పిన గురువు నాగభూషణం దంపతులను ఘనంగా సన్మానించారు. ఆదిలాబాద్ పట్టణంలోని వారి స్వగృహానికి వెళ్లి ఆయన్ను పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ జైనథ్ మండల అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి, కళావతి బ్లడ్ బ్యాంక్ చైర్మన్ తలాల అశోక్, అభివాటర్ అధినేత రాకేష్ రెడ్డి, ఏం.సుభాష్, సీ హెచ్ భూమన్న, ఎ.శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
గురువును సన్మానించిన పూర్వ విద్యార్థులు
RELATED ARTICLES