రెడ్డి హాస్టల్ లో కేకు కట్ చేస్తున్న లోక ప్రవీణ్ రెడ్డి
ఘనంగా లోక ప్రవీణ్ రెడ్డి జన్మదిన వేడుకలు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను రెడ్డి హాస్టల్ లో శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, రెడ్డి సంఘం నేతల నడుమ ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు రెడ్డి బంధువులు జన్మదిన శభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నల్ల నారాయణ రెడ్డి, రెడ్డి హాస్టల్ నిర్వహణ కమిటీ అధ్యక్షులు పొద్దుటూరు నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి అల్లూరి భూపతిరెడ్డి, ఉపాధ్యక్షులు సామ స్వామి రెడ్డి,ఆర్థిక కార్యదర్శి విఠల్ రెడ్డి, జలెందర్ రెడ్డి, సతీష్ రెడ్డి,శివప్రసాద్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు .