గ్రామ కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనానికి బయలుదేరిన సైదాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు
చిత్రం న్యూస్, సైదాపూర్: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళన బహిరంగ సభ శుక్రవారం జరిగింది. ఈ సభకు సైదాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు భారీగా తరలివెళ్లారు. గ్రామస్థాయి నాయకులతో ఏఐసీసీ అధ్యక్షుడు నేరుగా సభ ద్వారా సంభాషించడం ఇదే తొలిసారని ఏఎంసీ ఛైర్మన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దొంత సుధాకర్ తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేయాలని గ్రామ, మండల, యువజన, బ్లాక్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ నాయకులకు మల్లికార్జున ఖర్గే దిశా నిర్దేశం చేసినట్లు సుధాకర్ పేర్కొన్నారు._