గిరిజన యువతులకు ఉచిత కుట్టు శిక్షణ
చిత్రం న్యూస్,తలమడుగు: తలమడుగు మండలం పల్సీ(కే) గ్రామంలో 30 మంది గిరిజన మహిళలు యువతులకు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ ఇస్తున్నట్లు ఆ క్లబ్ అధ్యక్షుడు మంద అశోక్ తెలిపారు. శుక్రవారం ఆ గ్రామంలో ఉచిత శిక్షణ కేంద్రాన్ని సభ్యులతో కలిసి ఆయన ప్రారంభించాడు. ఆరు నెలల శిక్షణ ఇవ్వడంతో పాటు శిక్షణ అనంతరం కుట్టుమిషన్ సైతం అందించేలా కృషి చేస్తామన్నారు. రెండు మిషన్లతో పాటు రూ. 2 వేల విలువైన కుట్టు సామాగ్రి అందజేసి శిక్షణ ఇచ్చేందుకు ఇద్దరు శిక్షకులను నియమించామన్నారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి భగవాన్ దాస్, ఉపాధ్యక్షులు ప్రేమ్ రాజ్ గౌడ్, ప్రకాష్ బండారు దేవన్న దయాకర్ రెడ్డి కరీం అలీ నూరాని, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సున్నరేందర్ యాదవ్, మాజీ సర్పంచ్ నైతం పాయల్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.