ప్రధానోపాధ్యాయుడు జాడి సుదర్శన్ కు ప్లేట్లను అందజేస్తున్న విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు గడ్డం నాగారెడ్డి
చిత్రం న్యూస్, బేల: బేల మండలం సాంగిడి ఉన్నత పాఠశాల విద్యార్థులకు అదే గ్రామానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు గడ్డం నాగారెడ్డి ప్లేట్లను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసి ఉదారత చాటుకున్నారు.. గురువారం పాఠశాలకు వెళ్లి వీటిని ప్రధానోపాధ్యాయుడు జాడి సుదర్శన్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థులు బాగా చదివి కన్నవారి కలలను సహకారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రఘునాథ్, గోకుల్, అశోక్ తదితరులు పాల్గొన్నారు