బేలలో మాట్లాడుతున్న రెడ్డికా యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి మాడవార్ హరీశ్ రెడ్డి
చిత్రం న్యూస్, బేల: బేల మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ వ్యాపారులు డీఏపీ, యూరియా కొరత చూపెట్టి రైతులకు ముప్పతిప్పలు పెడుతున్నరన్నారని రెడ్డిక యువజన మండల సంఘం ప్రధాన కార్యదర్శి మాడవార్ హరీష్ రెడ్డి అన్నారు. బేలలో రైతులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా.. ఆయన మాట్లాడుతూ బుధవారం రోజున మండల వ్యవసాయ అధికారి సాయి తేజ రెడ్డి మండలంలో ఎక్కడ కూడా డీఏపీ, యూరియా కొరత లేదని విలేకరుల సమావేశంలో ఏర్పాటుచేసి చెప్పారన్నారు. మండల కేంద్రంలో ఫర్టిలైజర్ వ్యాపారస్తులు మాత్రం డీఏపీ మరియు యూరియా కొరత చూపెట్టి రైతులకు ముప్పతిప్పలు పెడుతున్నారని. అన్నారు. ఓ పక్క అధికారులు ఎరువుల కొరత లేదని ఇటు వ్యాపారస్తులు కొరత ఉందని అనడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతుందన్నారు. వ్యాపారస్థులకు దగ్గర ఉన్న రైతులకు లింక్ పేరు మీద ఎరువులు అమ్ముతున్నారని వాపోయారు. వెంటనే టాస్క్ ఫోర్స్ కమిటీ అయినా మండల తహసీల్దార్, ఎస్ఐ, వ్యవసాయ అధికారీ తనిఖీలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలనీ కోరారు. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా ఎరువులు ఇవ్వాలని లేని యెడల రైతులతో కలిసి దర్నలు చేపడతామణి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాడావార్ హరీష్, నిక్కందత్త, ఆకాష్ ఆగార్కర్ తదితరులు పాల్గొన్నారు.