సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తున్న పద్మశాలి సంఘం నేతలు
చిత్రం న్యూస్, బోథ్: పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. చేనేత కార్మికుల రుణమాఫీ కోసం రూ.33కోట్లు విడుదల చేయడంతో ఆ సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. చేనేత రంగం హ్యాండ్లూమ్స్ టెక్స్ టైల్స్, ఎక్స్పోర్ట్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని నేతన్నల వెంట మేమున్నామని సీఎం భరోసా ఇవ్వడంతో చేనేత పద్మశాలీలమంతా ఆనందం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మేర్గు భోజన్న,గౌరవ అధ్యక్షులు గంగుల మల్లేష్, వడ్లకొండ సురేందర్, సిరిపురం చంద్రమోహన్, కొండా స్వామి, ఆడెపు కిరణ్ కుమార్, తౌటు మల్లేష్, కడేరుగుల గోవర్ధన్, తాళ్ల బుచ్చన్న, వడ్లకొండ శ్రీనివాస్, జక్కుల మురళి, మార్కండేయ, కడేరుకుల శేఖర్, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు,