*స్థానిక సంస్థలే తొలి టార్గెట్
*ఉమ్మడి ఏపీ మున్సిపల్ కౌన్సిలర్స్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు గొరకపూడి చిన్నయ్య దొర
చిత్రం న్యూస్, సామర్లకోట: ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలాన్ని చూపిస్తామని ఉమ్మడి ఏపీ మున్సిపల్ కౌన్సిలర్స్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు గొరకపూడి చిన్నయ్య దొర అన్నారు. ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయిన పి.వి.ఎన్. మాధవ్ ని విజయవాడలో మంగళవారం చిన్నయ్యదొర అభినందించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారంలోకి రాగల శక్తి బీజేపీకి ఉందని, అయినా ఏపీలో బీజేపీ జెండా, కూటమి అజెండాతో ముందుకెళ్తామని అన్నారు. ముఖ్యంగా తాము తెలంగాణాలో తిరుగులేని శక్తిగా బీజేపీని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చిన్నయ్యదొర చెప్పారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయిన మాధవ్ తో కలిసి తాము త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. ముఖ్యంగా తాము నగరాలు, పట్టణాల స్థాయిలో బీజేపీ స్వయంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విజయం సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తామని చిన్నయ్య దొర తెలిపారు.