ఆంధ్రప్రదేశ్ బీజీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పి వి ఎన్ మాధవ్
చిత్రం న్యూస్, పెద్దాపురం: ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ (బీజెపీ) రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పి వి ఎన్ మాధవ్ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది . ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన గతంలో శాసనమండలిలో భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ , బీజే వైఎం లో పలు బాధ్యతలు నిర్వర్తించారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత దివంగత చలపతిరావు కుమారుడు, ఆయన తండ్రి రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. అధ్యక్ష పదవికి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు.మాధవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమితులైనందుకు పెద్దాపురం భారతీయ జనతా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బోలి శెట్టి రాంకుమార్, పెద్దాపురం టౌన్ వైస్ ప్రెసిడెంట్ కాకి భార్గవి, జనరల్ సెక్రటరీ నాలమటి సురేశ్ కుమార్ , బీజేపీ పార్టీ కార్యకర్తలు అభినందనలు తెలిపారు.