జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ను సన్మానిస్తున్న సామ రూపేష్ రెడ్డి
*స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి
చిత్రం న్యూస్, బేల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ కోసం కష్టకాలంలోను వెన్నంటే ఉండి జెండా మోసి కష్టపడి పనిచేసిన వారికి టిక్కెట్లు ఇవ్వాలని కోరారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ ప్రజలకు తాము అధికారంలో లేకపోయినా తమకు అండగా ఉంటామని భరోసా ఇచ్చి వారి సమస్యల పరిష్కారం కోసం ఎంతగానో కృషి చేయడం జరిగిందని తెలిపారు.అటువంటి వారికి రిజర్వేషన్ల ఆధారంగా అవకాశం కల్పించి వారి గెలుపుకు సహకరించాలని కోరారు. జిల్లా ఇన్చార్జి మంత్రిని కలిసిన వారిలో మాజీ సర్పంచ్ విట్టల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు విపిన్ టాక్రే, చవాన్ స్వప్నల్ తదితరులు ఉన్నారు.