క్యాన్సర్ బాధితుడికి బీఆర్ఎస్ నేతల ఆర్థిక సాయం
చిత్రం న్యూస్, బేల: మండలంలోని మొహబ్బత్ పూర్ గ్రామానికి చెందిన క్యాన్సర్ బాధితుడు సందీప్ ఠాక్రే కు బీఆర్ఎస్ నాయకులు ఆర్థిక సాయం అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం గ్రూపు ద్వారా జమ అయిన రూ.20,220 నగదును నాయకులు ఆయనకు అందజేశారు. సహకరించిన దాతలు ప్రతి ఒక్కరికీ బీఆర్ఎస్ పార్టీ తరపున ఆయన ధన్యావాదాలు తెలిపారు.
-Advertisement-