సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
చిత్రం న్యూస్, లోకేశ్వరం: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గడ్ చందా పంచాయతీ సెక్రెటరీ రాజన్న అన్నారు. మంగళవారం పంచాయతీలో డ్రై డే నిర్వహించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటి పరిసరాలను ఎప్పడికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ ప్రతి మంగళ, శుక్రవారం నాడు డ్రై డే గా పాటించాలన్నారు. ఇంటి పరిసరాలలో కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ డబ్బాలు, పాత కుండలు, పనికి రాని వస్తువులను ఉంచుకోరాదని, దానిలో వర్షపు నీరు పడి దోమల లార్వా వృద్ధి చెంది డెంగ్యూ, , చికున్ గున్యా, మలేరియా, పైలేరియా వంటి వ్యాధులు ప్రబలుతాయన్నారు. దోమల పుట్టుక గురించి, దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి దోమల నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ , ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.