అధిక ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులపై భారం
*పుస్తకాలు,యూనిఫామ్ పాఠశాలలోనే కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి
చిత్రం న్యూస్ జమ్మికుంట: జమ్మికుంటలోని ప్రైవేట్ స్కూల్స్ లో పుస్తకాలు, యూనిఫామ్ పాఠశాలలో కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాల యజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని కరీంనగర్ జిల్లా బీజేవైఎం అధికార ప్రతినిధి గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ విద్యను వ్యాపారం చేసి బుక్స్ యూనిఫార్మ్స్ అటువంటి పాఠశాలలో తీసుకోవాలని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం అనేది చాలా అన్యాయంఅని తెలిపారు. అధిక ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులపై భారం పడుతుందన్నారు. దీనికి సంబంధించి జిల్లా విద్యాధికారి స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.