నూతన ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి
*బీజేపీ బేల మండల
అధ్యక్షుడు ఇంద్రశేఖర్ డిమాండ్
చిత్రం న్యూస్ బేల: బేల మండల కేంద్రంలో నూతనంగా ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని బీజేపీ మండల అధ్యక్షుడు ఇంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. పీహెచ్సీ ఆసుపత్రి కట్టించి నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా ప్రారంభానికి నోచుకోవడం లేదన్నారు. ఆస్పత్రిని వెంటనే ప్రారంభించకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామన్నారు. పేద ప్రజలకు మెరుగైన ఉద్యమం అందించడానికి కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు బర్కాడే రాము,మాజీ మండల అధ్యక్షుడు దత్తా నిక్కం,జనరల్ సెక్రెటరీ సందీప్ ఠాక్రే,మాజీ సర్పంచ్ రాకేష్,దర్నె జీవన్,గంగాధర్, నార్లవర్ అజయ్,తదితరులు పాల్గొన్నారు