విద్యార్థుల అకౌంట్లోకి రీయింబర్స్మెంట్ ఫీ, స్కాలర్షిప్ డబ్బులు
చిత్రం న్యూస్ బేల:2024 -25 విద్యా సంవత్సరం నుండి విద్యార్థుల కాలేజీ రీఎంబెర్స్మెంట్ ఫీ, స్కాలర్ షిప్ డబ్బులు రెండు కూడా విద్యార్థుల బ్యాంక్ అకౌంట్ లో పడుతున్నాయని కీర్తన డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డా. వరప్రసాద్ రావు తెలిపారు. కాలేజ్ రీఎంబెర్స్మెంట్ డబ్బులు కాలేజీ లో జమ చేసి తగు రశీదు పొందవచ్చన్నారు. స్కాలర్ షిప్ మాత్రం మీరు ఉంచుకోవాలని తెలిపారు. ఈ సంవత్సరం నుండి ఫ్రెష్, రెన్యువల్ విద్యార్థులకి వరిస్తుందన్నారు. ఏమైన సందేహాలు ఉంటే ఆన్లైన్ లో పూర్తి సమాచారం ఉంటుందని, కాలేజీ లో నేరుగా కలవవచ్చు అని కీర్తన డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డా. వరప్రసాద్ రావు, ఏ సి రీఎంబెర్స్మెంట్ ఇంచార్జి సాగర్, జూనియర్ అసిస్టెంట్ అనికేత్ పేర్కొన్నారు.