మాట్లాడుతున్న ఎస్ఐ మౌనిక
చిత్రం న్యూస్, పెద్దాపురం: పెద్దాపురం మరిడమ్మ తల్లి జాతర ఉత్సవాలు పురష్కరించుకుని యువకులు దురుసుగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పెద్దాపురం ఎస్సై వి.మౌనిక తెలిపారు. వీధి సంబరాలు జరుగుతున్న సమయంలో దురుసు ప్రవర్తన, అసభ్యపదజాలం, రెచ్చగొట్టే విధంగా ఎవరైన ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే మరిడమ్మ ఉత్సవాలు పురష్కరించుకుని వీధి సంబరాల నిర్వహణ కమిటీ సభ్యులకు నిబంధనలతో కూడిన ఆదేశాలు సృష్టంగా జారీ చేసినట్లు ఆమె తెలిపారు.ఇటీవల జరిగిన జాతరలో దురుసుగా ప్రవర్తించిన వారిపై బైండోవర్ చేసినట్లు తెలిపారు.