డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ ని కలిసి వినతిపత్రం అందజేస్తున్న సామ రూపేష్ రెడ్డి
చిత్రం న్యూస్ బేల: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలను గుర్తించి గూడు కల్పించాలని లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తే ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పలు ఏజెన్సీ గ్రామాలలో ఆ ఇళ్ల నిర్మాణం జరగకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి అన్నారు. దీంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన స్థానిక అర్హులైన పేద ప్రజలకు కనీసం గూడు సౌకర్యం కూడా లేకుండా పోతుందన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ లక్ష్యానికి అడ్డుపడకుండా అర్హులైన పేద ప్రజలు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే అవకాశం తో పాటు స్థానిక అటవీశాఖ అధికారులు వీటికి అడ్డుపడకుండా అనుమతివ్వాలని శనివారం జిల్లా అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.అయితే సానుకూలంగా స్పందించిన డీ ఎఫ్ ఓ పరిశీలించి పర్మిషన్లు ఇచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆయన్ను కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్,యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల నాగరాజు, యువజన కాంగ్రెస్ నాయకులు మేకల జితేందర్,అనుముల ఉదయ్ కిరణ్,యువజన కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షుడు రంజిత్ రెడ్డి తదితరులు ఉన్నారు.