చంద్రమాంపల్లి గ్రామస్తుల సమస్యలను పరిష్కరించండి
_ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు వినతిపత్రం అందజేస్తున్న పెద్దాపురం ఏఎంసీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు
చిత్రం న్యూస్, పెద్దాపురం: కాకినాడ జిల్లా అచ్చంపేట లో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప క్యాంప్ కార్యాలయంలో నాయకులతో గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి గ్రామస్తులు తమ సమస్యలను వినతి రూపంలో ఇచ్చారు. చంద్రమాంపల్లి గ్రామస్తుల తరపున పెద్దాపురం ఏఎంసీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు వినతిపత్రం అందజేశారు. అనంతరం తొలి అడుగు కార్యక్రమం గురించి, అనుబంద కమిటీలు గురించి చర్చించారు. చంద్రమాంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు రేలంగి బుజ్జి ,టీడీపీ నాయకులు షేక్ రెహ్మాన్, పెద్దాపురం అబ్జర్వర్ బొల్లా వెంకటరమణ, క్లస్టర్ ఇంచార్జిలు, మండల ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లు ఇతర నియోజవర్గం నుంచి వచ్చిన మండల, పట్నం అబ్జర్వర్లు తదితరులు పాల్గొన్నారు.