పూరీ జగన్నాథ్ రథయాత్రకు తరలివచ్చిన అశేష జనవాహిని
రథాలపై గుండిచాదేవి ఆలయం వరకు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి
చిత్రం న్యూస్, ఒడిశా: ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాలను ఫండాలు (పూజారులు) సుందరంగా అలంకరించారు. ఈరథాలపై జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రదేవిలు గుండిచాదేవి ఆలయం వరకు విహరిస్తారు. భక్తులు దారిపొడవునా జై జగన్నాథ్..అంటూ ఆ దేవ దేవుని నామస్మరణ చేశారు. భక్త జనంతో ఆలయ ప్రాంతమంతా మార్మోగింది.
ఈ ఏడాది రథయాత్రను వీక్షించేందుకు 12 లక్షల మందికి పైగా భక్తులు వస్తున్నట్లు అంచనా వేశారు. దేశంలోని నలుమూలల నుంచి ఇప్పటికే భారీగా జనం తరలి రావడంతో అధికారులు 10 వేల మంది పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు చేపట్టారు. ఆలయ పరిసరాల్లో 275 ఏఐ కెమెరాలు, డ్రోన్ల సాయంతో నిఘా ఉంచారు.