డ్యాన్సర్ గా మొదలు..నటుడిగా ఎదిగి
*నీరుకుళ్ళ సినిమాతో వెండితెర పైకి
*ఆర్ కే మాస్టర్ ప్రస్థానం
చిత్రం న్యూస్, ఫిల్మ్ నగర్:
ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఉన్నత శిఖరాలు అందుకున్న ఓ మనిషి.. నాన్న కార్ డ్రైవర్.. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించి వాటిని పాఠాలుగామార్చుకొని డ్యాన్స్ మాస్టర్ గా తనజీవితం ప్రారంభించి నటుడిగా ఎదిగి మన తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని చాలా మందికి ఆదర్శంగా నిలిచాడు. అతనే మన ఆర్ కే మాస్టర్ (రాధాకృష్ణ). చిన్న డ్యాన్స్ర్ గా తన జీవితాన్ని ప్రారంభించి గ్రూప్ డ్యాన్సుల్లో ఎక్కడో మూలన ఉండి నటించిన తను మెయిన్ డ్యాన్సర్ గా ఎదిగి ఎంతోమంది హీరోలకు డ్యాన్స్ నేర్పారు. ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి, రమ గార్లకు డ్యాన్స్ లో మెలకువలు నేర్పి ప్రపంచాన్నంతా తన వైపు తిప్పుకొన్నాడు. ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు నటుడిగా తన ప్రస్థానం ప్రారంభించి మంచి విజయాలతో దూసుకు పోతున్నాడు. నీరుకుళ్ల అనే సినిమాతో వెండితెర పై అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని అందరి ప్రశంసలు పొందాడు. తను నటించిన మొదటి సినిమా సుమారు 75 థియేటర్లలో రిలీజ్ అయ్యింది. దీంతో తానేంటో నిరూపించుకున్నాడు. దాని తర్వాత వెంటనే మహాబలి అనే సినిమా ఒకే నెల తేడాతో రిలీజ్ అయ్యింది. అతడితో ఒక సినిమా కూడా చేయని వాళ్ళతో తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అవి ఓస్కార్ అవార్డు మిస్సింగ్, హారర్ మూవీ ,దుస్కర్మ ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. నీరుకుళ్ల ఓక హారర్ సినిమా మరియు మహాబలితో ఒక పెద్ద సాహసమే అని చెప్పవచ్చు. కేవలం సినిమా మొత్తంలో 6 డైలాగ్ లతో ఉంటుంది. ప్రముఖ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ సినిమాలో కూడా చట్టం చేశాడు . ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలకి డ్యాన్స్ నేర్పి చాల మంది డ్యాన్స్ మాస్టర్ల దగ్గర పనిచేసి ఇప్పుడు నటుడిగా తన ప్రస్తానాన్ని సాగిస్తున్నాడు మన ఆర్ కే మాస్టర్.