అహల్యాభాయి హోల్కర్ తృతీయ శత జయంతి వేడుకలు
చిత్రం న్యూస్, పెద్దాపురం:
రాణి అహల్యాభాయి హోల్కర్ తృతీయ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర బిజెపి పిలుపు మేరకు, మహారాణి అహల్యా భాయి హోల్కర్ యొక్క స్ఫూర్తిదాయక జీవిత చరిత్రను నేటి తరానికి, ముఖ్యంగా మహిళలకు ఆదర్శనీయంగా తెలియజేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయం 11:00 గంటలకు శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం, లూతరన్ హై స్కూల్ ఎదురుగా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో బిజెపి శ్రేణులు అందరూ పాల్గొని, జాతీయ భావ ఐక్యతను పెంపొందించాలని బిజెపి పెద్దాపురం పట్టణ అధ్యక్షులు బొలిశెట్టి రామకుమార్ కోరారు.