ఒకే చోట కలిసి.. సందడి చేసి
2003-04 సంవత్సరం పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
చిత్రం న్యూస్, జైనథ్: అక్కడ అఆలు దిద్దినవాళ్ళు ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. అక్కడి గురువులు నేర్పిన పాఠాలు ఎందరినో ఉన్నత స్థానాలకు తీసుకెళ్లింది. పదేళ్ల పాటు కలిసి చదువుకున్న వాళ్లంతా పదో తరగతి పూర్తికాగానే ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. 23 ఏళ్ల తర్వాత వారంతా ఆదివారం ఒకే చోట కలిసి సందడి చేశారు. ఇలాంటి అపూర్వ ఘట్టానికి వేదిక అయింది జైనథ్ మండలంలోని దీపాయిగూడ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఆ బడిలో 2003-04 సంవత్సరం పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం, గురువుల సన్మాన మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థిగా వెళ్లిపోయిన వారు తమ జ్ఞాపకాలకు గుర్తుగా తరలివచ్చారు. తమకు చదువు చెప్పిన గురువులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఒక్కచోట కలవడంతో సంబరపడ్డారు. తమ మధురానుభూతులను పంచుకున్నారు. ఉపాధ్యాయులు శ్యాంసుందర్, రామ్మోహన్, శ్రీకాంత్, సంజయ్, గణేష్, పూర్వ విద్యార్థులు తహసీల్దార్ నలందప్రియ, వాసవి, సౌజన్య, కళ్యాణి, జ్యోతి, రేష్మ, ఆస్మా, చైతన్య, మౌనిక, ప్రవీణ, సజన, స్వప్న, నైనత, ఓం ప్రకాష్, నరేష్, రాకేష్, సంజీవ్, ప్రశాంత్, రాజు, రాకేష్, శ్రీరామ్, దీపక్, తిరుపతి, కపిల్, రాము, బాలాజీ, యష్పాల్, మనోహర్, రతన్ తదితరులు పాల్గొన్నారు.




