రాజీవ్ జ్యోతి యాత్రకు ఆదిలాబాద్‌లో ఘన స్వాగతం: రాజీవ్ సేవలు మరువలేనివి – కంది శ్రీనివాస రెడ్డి
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారకార్థం తమిళనాడు శ్రీపెరంబదూర్ నుండి ఢిల్లీ వీరభూమి వరకు సాగుతున్న రాజీవ్ జ్యోతి యాత్ర ఆదివారం ఆదిలాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణులు యాత్రకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. 1984 నుండి 1989 వరకు ప్రధానిగా పనిచేసి దేశంలో ఐటీ విప్లవానికి నాంది పలికిన మహనీయుడని కొనియాడారు. చిన్న వయసులోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం దేశానికి తీరని లోటని అన్నారు. ప్రతి సంవత్సరం మెమోరియల్ యాత్ర నిర్వహిస్తున్న శామ్యూల్ ద్రవ్యమ్ బృందానికి అభినందనలు తెలిపారు. రాజీవ్ గాంధీ ఆశయాలు, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. యాత్రకు స్వాగతం పలకడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కిజర్ పాషా, నాయకులు బెజ్జంకి అనిల్, మోతిరామ్, గౌలి సంజయ్, పరమేశ్వర్, శ్రీకర్ గౌడ్, కుదురుపాక సురేష్, కోలా నర్సింలు, తొడసం దౌలత్ రావు, షకీల్, రఫీక్, సురేందర్, డేరా కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




