చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం సెంట్రల్ జైలులో దాదాపు 640 మంది ఖైదీలకు టీబీ పరీక్షలు నిర్వహించడం ,అలాగే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి డాక్టర్ల సహకారంతో కంటి పరీక్షలు, స్కిన్ ,డెంటల్ , గైనిక్, గుండెకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ అధికారి డా. బి రాజశ్రీ, జిల్లా టీబీ నియంత్రణ అధికారి అండ్ పోగ్రామ్ ఆఫీసర్ ఎయిడ్స్ అండ్ లెప్రసీ డా. దేవి నాగేశ్వరి, ఎన్ వి హెచ్ సి పి నోడల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేష్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సామ్రాట్ యాదవ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అవంతి, డి హెచ్ ఈ ఘన్ పూర్ వెంకటేశ్వర్, ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సిబ్బంది, జిల్లా టటీబీ నియంత్రణ సిబ్బంది, మొబైల్ ఐసీటీసీ సిబ్బంది జిల్లా వైద్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

