జంగారెడ్డిగూడెం లో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్
చిత్రం న్యూస్, జంగారెడ్డిగూడెం: మండే ఎండలు, వడగాలుల నేపథ్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం మంచి పరిణామని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో గురువారం పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు. ప్రయాణికులు, పాదచారులకు స్వయంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణ మండల కూటమి నాయకులతోపాటు అధికారులు పాల్గొన్నారు.

