చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాలలో భాగంగా ఆహార భద్రత శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాకథాన్‌ను అదనపు కలెక్టర్ రాజేశ్వర్ ప్రారంభించారు. రిమ్స్ ఆసుపత్రి నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు నిర్వహించిన ఈ వాకథాన్‌లో అధికారులు, అంగన్వాడీలు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రసంగించి, ఫుడ్ లైసెన్స్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆహార భద్రత అధికారి ప్రత్యూష, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ నాయక్, వైద్యులు దీపక్ పుష్కర్, నరేందర్ పాల్గొన్నారు.

