-Advertisement-

సాయిరాం మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి : కుటుంబ సభ్యుల ధర్నా

చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో (మామడ):  మండలంలోని దిమ్మదుర్తి గ్రామ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయిరాం చనిపోలేదని వాహనంతో ఢీ కొట్టి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రహదారిపై ధర్నా చేశారు ఈ ఘటన స్థలాన్ని సోన్ సీఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్ఐ పోలీసు సిబ్బందితో చేరుకొని బాధితులతో మాట్లాడి అతని  మృతికి కారకులైన వారిని పట్టుకుని శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments