చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో ( బైంసా ): రాజకీయాలకతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు మంగళవారం కుభీర్ మండలంలోని మాలేగం గ్రామంలో బైంసా నుండి మిర్జాపూర్, లింగా, కుంబి, నిగువ మహారాష్ట్ర బార్డర్ వరకు రూ.20 కోట్ల నిధులతో నిర్మిస్తున్న రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గత పది సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న రహదారి బాగు చేస్తున్నామని తెలిపారు. దశలవారీగా గ్రామీణ రోడ్లను మెరుగుపరుస్తానని, అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు బాసర ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయకపోతే మంత్రి కొండా సురేఖ సమక్షంలో భిక్షాటన చేసైన ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అభివృద్ధి కోసం ప్రోటోకాల్ ప్రకారం అందరిని విన్నవిస్తూ దశలవారీగా నిధులు తెచ్చుకుంటున్నామని తెలిపారు.ప్రజాస్వామ్య బద్దంగా సర్పంచులు వ్యవహరించాల్సిందిగా సూచించారు, తప్పు చేస్తే తాను చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అభివృద్ధి పనులు చేయడానికి ఎప్పుడూ స్వాగతిస్తానని, కానీ తన ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నియోజకవర్గం ఎమ్మెల్యేగా తన వద్ద ఎలాంటి బేదాభిప్రాయాలు లేవని, రాజకీయాలకు అతీతంగా అందరి పనులు చేస్తానని తెలిపారు, బాసర సరస్వతి అమ్మవారి ఆశీర్వాదం తనపై ఉందని, తన హయాంలో ఆలయ పునర్నిర్మాణం జరగడం అదృష్టంగా భావిస్తున్నానాన్నారు. రెండున్నర సంవత్సరాలలో పార్టీలకు అతీతంగా నాలుగువేల మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు,నాయకులు,ఆయా గ్రామ సర్పంచులు పాల్గొన్నారు
-Advertisement-
రాజకీయాలకతీతంగా అభివృద్ధి: ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్
RELATED ARTICLES

