చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో: కుంటాల మండలంలోని కల్లూరు గ్రామ పంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను ఎంపీడీవో అల్లాడి వనజ సోమవారం పరిశీలించారు. పనుల నాణ్యత, కూలీల హాజరు, పురోగతిపై ఆమె సమీక్షించారు.గ్రామంలో కొనసాగుతున్న పనుల నాణ్యతను ఎంపీడీవో అల్లాడి వనజ క్షుణ్ణంగా పరిశీలించారు. కూలీల హాజరు నమోదు, పని ప్రదేశంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై ఆమె ఆరా తీశారు. పనుల పురోగతిని సమీక్షిస్తూ, నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇటీవల ప్రవేశపెట్టిన ముఖచిత్ర హాజరు విధానం గురించి ఎంపీడీవో ఉపాధి కూలీలకు వివరించారు. ఈ విధానం ద్వారా బినామీలకు తావులేదని, సాంకేతిక సహాయకులు జై సింగ్ కొలతలు తీసి, పనిచేసిన దానికి అనుగుణంగా చెల్లింపులు జరిగేలా చూస్తారని తెలిపారు. ఇది పారదర్శకతను పెంచుతుందని ఆమె పేర్కొన్నారు ఈ కొత్త విధానం వల్ల పనుల పర్యవేక్షణ మరింత మెరుగుపడుతుందని, కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా చెల్లింపులు జరుగుతాయని ఎంపీడీవో భరోసా ఇచ్చారు. కూలీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కొండూరు భోజన్న, సీనియర్ మేట్ ముస్కు ముత్యం, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. పనుల అమలులో ఎదురవుతున్న సమస్యలపై కూలీల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు.


