చిత్రం న్యూస్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని మందలపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామసభను నిర్వహించారు. ఈ గ్రామ సభలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు మహాలక్ష్మి, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలలో లబ్ధిదారుల వివరాలు, గ్రామ పరిపాలన వ్యవస్థ గురించి పంచాయతీ పాలకమండలి సమక్షంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల సమక్షంలో ప్రభుత్వ అధికారుల తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఎల్ఐ, ఎంఈఓ జగపతి, పంచాయతీ, పంచాయతీ సెక్రెటరీ గోపీనాథ్, సర్పంచ్ గుజ్జల శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ చింతలపాటి మురళి, పంచాయతీ కార్యవర్గ సభ్యులు, వార్డు మెంబర్లు,అంగన్వాడి టీచర్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


