చిత్రం న్యూస్, డెస్క్: సాకీబండ తండలో హనుమాన్ జయంతి సందర్భంగా రాముల వారి గుట్టపై భోగ్ బండార్ పూజా కార్యక్రమం ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయాత్ర నిర్వహించగా, హిందూ బంధువులు, హిందూ సంఘాల ప్రతినిధులు, తండా వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హిందూ సంఘాల నేతలు మాట్లాడుతూ, యువత భక్తి మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో హిందువులు జనజాగృతి పొందాల్సిన అవసరం ఉందని తెలిపారు. మన హిందూ సాంప్రదాయాలు, సంస్కృతిని మన పిల్లలకు తెలియజేయడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాండు నాయక్, సక్రు నాయక్, బోడ్యి నాయక్, రమేష్ నాయక్, రవి రాథోడ్, దేవేందర్ నాయక్, శివరాం, గోపి, లాలు, జైపాల్, మణిపాల్, నరేష్, మోతిలాల్, హరిలాల్, శ్రీను, దుద్య, కుభ్యా, సుమన్, వినోద్, మురారి, కుమార్, రమేష్, బాస్కర్, నరేష్, సునీల్, మహిపాల్, హిందూ బంధువులు, హిందూ సంఘాలు, తండా వాసులు భారీ ఎత్తున పాల్గొన్నారు.


