చిత్రం న్యూస్, ఆదిలాబాద్:TVTA (Technical Vocational Teachers Association) ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మోడల్ స్కూల్ జైనథ్ కు చెందిన వొకేషనల్ టీచర్ సయ్యద్ సబ్దర్ అజీజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా మోడల్ స్కూల్ బోథ్‌కు చెందిన వొకేషనల్ టీచర్ పల్లికొండ సాయికృష్ణ ఎన్నికయ్యారు.ఈ ఎన్నికలు TVTA రాష్ట్ర ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో సాఫీగా నిర్వహించబడ్డాయి. జిల్లా స్థాయి నాయకత్వానికి ఈ ఇద్దరు నాయకులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సయ్యద్ సబ్దర్ అజీజ్ మాట్లాడుతూ.. తమపై ఉంచిన నమ్మకానికి సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వొకేషనల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. జనరల్ సెక్రటరీగా ఎన్నికైన సాయికృష్ణ సభ్యుల సహకారంతో సంఘ అభివృద్ధికి పని చేస్తానని పేర్కొన్నారు.TVTA రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ఇద్దరు నాయకులను అభినందించారు.


