30 ఏళ్ల నిరీక్షణకు తెర..గిమ్మ రైతులకు అందిన రైల్వే భూపరిహారం
చిత్రం న్యూస్, భోరజ్:ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం గిమ్మ గ్రామ రైతుల మూడు దశాబ్దాల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. గత 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రైల్వే ల్యాండ్ భూసేకరణ పరిహారం డబ్బులు ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రత్యేక చొరవ, నిరంతర కృషి ఫలితంగా దాదాపు 89 లక్షల రూపాయల నిధులు విడుదలయ్యాయి. 30 ఏళ్ల పోరాటం: రైల్వే లైన్ నిర్మాణం కోసం సేకరించిన భూములకు సంబంధించి గిమ్మ...