కలెక్టర్ రాజర్షి షా ను సన్మానించిన బేల మండల సర్పంచులు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమం "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" లో భాగంగా జిల్లాలో జరిగిన కార్యక్రమంలో బేల మండల సర్పంచులు కలెక్టర్ రాజర్షి షా ను శాలువతో సన్మానించి,పుష్పగుచ్చం అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సర్పంచులు నిరంతరం కృషి చేయాలని, మండల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో కలెక్టర్ చేస్తున్న కృషిని, ముఖ్యంగా 'ప్రజా పాలన'...